కాకినాడ పోర్టు వ్యవహారంలో ఈడీ నోటీసులు జారీ..! 13 h ago
కాకినాడ పోర్టు వ్యవహారంలో ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఎంపీ విజయసాయి రెడ్డి, ఆయన వియ్యంకుడు, అరబిందో ఫార్మా పీ. శరత్ చంద్రారెడ్డిలకు నోటీసులు ఇచ్చింది. గతంలో పార్లమెంట్ సమావేశాల పేరుతో ఎంపీ విజయసాయి, అనారోగ్య కారణాలతో శరత్ చంద్రారెడ్డి విచారణకు డుమ్మా కొట్టారు. ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి విచారణకు హాజరైయ్యారు. రూ.494 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?.. ఎవరిచ్చారు..? అసలు అరబిందో ఆ డబ్బులు ఎలా సమకూర్చింది అన్న అంశాలపై విచారణ కొనసాగుతుంది.